రెస్టా‌రెంట్‌లో కాల్పులు: సింగర్ టిటో టర్బెలినో మృతి

2మెక్సికో: సాయుధులైన దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రముఖ మెక్సికన్ బాంద సింగ్ టిటో టర్బెలినో మృతి చెందాడు. ఈ ఘటన సొనారా రాష్ట్రంలోని సియుడాడ్ ఓబ్రెగాన్‌లో చోటు చేసుకుంది. 33ఏళ్ల తోవర్ రాస్కన్ బాంద సింగర్ టిటో టర్బెలినోగా అందరికీ సుపరిచుతుడు. అతను సియుడాడ్‌లో శుక్రవారం ఓ ప్రదర్శన ఇచ్చేందుకు ఇక్కడకు వచ్చాడనే విషయం అతని ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిసిందని పోలీసులు చెప్పారు. తోవర్ సియుడాడ్ ఓబ్రెగాన్‌లోని ఓ రెస్టారెంటులో ఉన్న సమయంలో కొందరు దుండగులు ప్రవేశించి చాలా దగ్గర్నుంచి అతనిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో వెంటనే రెస్టారెంటు సిబ్బంది అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మ్యూజిక్ బృందాలపై ఇటీవలి కాలంలో దాడులు ఎక్కువయ్యాయని పోలీసులు చెప్పారు. గత కొంత కాలంలో చాలా మ్యూజిక్ బందాలపై దాడులు జరిపిన దుండగులు, వారిని హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ దాడులు మాదక ద్రవ్యాల ముఠాలే చేస్తున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. టర్బెలినో ఎక్కువగా ప్రేమకు సంబంధించిన పాటలు పాడుతారని పోలీసులు చెప్పారు. అతను ఇప్పుడిప్పుడే సింగర్‌గా ఎదుగుతున్నాడని తెలిపారు. అతనికి స్నేహితులు, గర్ల్ ఫ్రెండ్స్, ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారని చెప్పారు. అతని మృతిపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.

Leave a Comment