రేపు మెదక్ జిల్లాలో కేసీఆర్ పర్యటన

4హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కే.చంద్రశేఖరరావు(కేసీఆర్) తొలిసారి మెదక్ జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు.  రేపు ఉదయం11గంటలకు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత 12.45 గంటలకు కేసీఆర మెదక్ జిల్లా పర్యటనకు వెళ్తారు.
మధ్యాహ్నం 1.45 గంటలకు వర్గల్‌ గ్రామంలోని సరస్వతీ ఆలయంలో  కేసీఆర్ పూజలు చేస్తారు. ఆర్వాత 2.30 గంటలకు గజ్వేల్‌లో నిర్వహించే భారీ బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు.  బహిరంగ సభ తర్వాత 3.30 నుంచి రాత్రి 7గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు.

Leave a Comment