రేప్కేసులో ఉన్న కేంద్ర మంత్రిని తొలగించాలి:మహిళా కమిషన్

Nihalchandన్యూఢిల్లీ: అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న కేంద్ర మంత్రి నిహల్ చంద్ను ఆ పదవి నుంచి  తొలగించాలని  జాతీయ మహిళా కమిషన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరింది. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ మమతా శర్మ ప్రధానికి ఒక లేఖ రాశారు.

జైపూర్లో ఒక వివాహిత యువతిపై జరిగిన అత్యాచారం కేసులో 17 మంది నిందితులలో నిహల్ చంద్ ఒకరు. ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మంత్రిగా ఉంచడం భావ్యంకాదని మమతా శర్మ పేర్కొన్నారు. అతనిని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు.

Leave a Comment