లండన్‌లో పాక్ నేత అల్తాఫ్ హుస్సేన్ అరెస్ట్

dలండన్: పాకిస్థాన్‌కు చెందిన ప్రఖ్యాత రాజ కీయ నాయకుడు అల్తాఫ్ హుస్సేన్‌ను అక్రమ ద్రవ్య చెలామణి ఆరోపణలపై మంగళవారం లండన్‌లో స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హుస్సేన్ పాక్‌లోని ముత్తహిద ఖ్వామీ మూవ్‌మెంట్(ఎంక్యూఎం) పార్టీ అధినేత. పాక్‌లో అతిపెద్దదైన కరాచీ నగరంపై ఆయనకు, ఎంక్యూఎంకు గట్టి పట్టుంది. అల్తాఫ్ అరెస్ట్ వార్త వ్యాపించడంతో కరాచీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెట్రోల్ బంక్‌లు, బ్యాంకులు, దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. లండన్‌లోని ఒక గృహ సముదాయంలో 60 ఏళ్ల వ్యక్తిని మనీ లాండరింగ్ చేస్తున్నాడన్న సమాచారంతో అరెస్ట్ చేశారు.

Leave a Comment