లండన్ లో ప్రవాస భారతీయుల సంఘీభావ దీక్ష

చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేస్తున్న దీక్షకు మద్ధతుగా యూకేలోని లండన్ నగరంలో పార్లమెంటు ఎదురుగా మహాత్మాగాంధీ గారి విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావ దీక్ష చేపట్టటం జరిగింది. డాక్టర్ సుందర రాజు మల్లవరపు గారు ఉదయం 7గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఒక్క రోజు నిరాహార దీక్ష చేశారు. ఆయనకి మద్ధతుగా గోపాల్ ఎండ్లూరి, నరేష్ మల్లినేని, జగదీష్ బండారుపల్లి, విజయ్ అడుసుమల్లి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హామీలన్నీ నెరవేర్చడానికి చేసే అన్ని ప్రయత్నాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్ధతుగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు..

 

 

Leave a Comment