లండన్ లో “వరంగల్ ఉప-ఎన్నిక విజయోత్సవం”

వరంగల్ ఉప ఎన్నికల్లో టి. ఆర్. యస్ పార్టీ అబ్యర్ధి పసునూరి దయాకర్ గారు  రికార్డ్ మెజారిటీ తో గెలవడం తో, క్షేత్రస్థాయిలో నాయకులు – కార్యకర్తలు మాత్రమే కాకుండా ఖండాంతరల్లో నినసిస్తున్న ప్రవాస తెలంగాణా బిడ్డలు సైతం సంబరాలు జరుపుకున్నారు.
ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ – లండన్ ఆద్వర్యం లో టి. ఆర్. యస్ నాయకులు కార్యకర్తలు సానుబూతిపరులు ఒక్క దగ్గర చేరి శుభాకాంక్షలు తెలుపుకొని సంబరాలు చేసుకొన్నారు. కే. సీ. ఆర్ జిందాబద్ అంటూ లండన్ వీధులు మారుమొగాయి.
ఈ సంధర్బంగా అద్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ … ముందుగా వరంగల్ ప్రజలకు కృతజ్ఞతాభివాందనాలు తెలిపి, ఈ విజయం వరంగల్ ప్రజలతో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కే. సీ. ఆర్ గారు మరియు ఎంతో బాద్యతగా కర్తవ్యం  నిర్వహిస్తున్న క్యాబినెట్ మంత్రులు – నాయకులదని తెలిపారు.
నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణా బిడ్డలు, ముఖ్యంగా టి. ఆర్. యస్ కార్యకర్తలు గర్వించి, తల ఎత్తుకొనేలా బంగారు తెలంగాణా కై అహర్నిశలూ శ్రమిష్తున్న ముఖ్యమంత్రి కే. సీ. ఆర్  గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎప్పటిలాగే  అన్ని సమయాల్లో పార్టీ వెంటే ఉండి, ఆది ఎన్నికల సమయమైన లేక పునర్నిర్మాణంలో మా బాద్యతైన కే. సీ. ఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు.
ఈ  సంబరాల్లో ఎన్నారై. టి.అర్.యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం కార్యదర్శి నవీన్ రెడ్డి, కార్యదర్శి   దొంతుల వెంకట్ రెడ్డి , యూకే & యురోప్ ఇన్‌ఛార్జ్  విక్రమ్ రెడ్డి,లండన్ ఇన్‌ఛార్జ్   రత్నాకర్ కడుడుల,  అధికార ప్రతినిథి  శ్రీకాంత్ జెల్ల. వెల్‌ఫేర్ ఇన్‌ఛార్జ్  వినయ్ కుమార్,మెంబర్‌షిప్ ఇన్‌ఛార్జ్  సతీష్ రెడ్డి బండ,ముఖ్య నాయకులు  సృజాన్ రెడ్డి చాడా, సత్యం రెడ్డి కంది, సత్య,
హాజరైన వారిలో ఉన్నారు.
Media_NRI TRS CELL

Leave a Comment