లక్కీ ఐటమ్ గర్ల్ హంసా నందిని…

ప్రస్తుతం హంసా నందిని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ కి హాట్ ఫేవరేట్ గా పేరు తెచ్చుకుంది. ఐటమ్ సాంగ్స్ అంటే కాస్తో..కూస్తో కాదు ఊహించనంత విధంగా ప్రేక్షకుల ముందు కనబడాలి. ప్రతి సారి ఐటెం సాంగ్ అనేది స్పెషల్ గా ఉండాలి. ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమాలకు ఐటెం సాంగ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా తయారవుతున్నాయి, అలాగే వీటిపై అంచనాలు కూడా బాగా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి సాంగ్ లోనూ డాన్సులు, వేషదారణ, హావభావాలు మార్చుకోవాలి. ఇవన్నీ కూడా హంసా నందినిలో చక్కగా ఇమిడి ఉన్నాయి. అంతకు మించిన అందం కూడా ఉండటం వల్ల ప్రస్తుతం టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందంతా ఆమెకు మోడలింగ్ మీద ఉన్న ప్రభావమే ఆమెను ఇంతంటి స్థాయికి తీసుకొచ్చిందని చెప్పవచ్చు. సినిమాల్లోకు రాకముందు మోడలింగ్ రంగంలో కూడా బాగా క్రేజ్ సంపాందించుకొన్నది.

Leave a Comment