లక్షల ఏళ్లకు ఒకసారి జరిగే సన్నివేశం….

లక్షల ఏళ్ళకు ఒకసారి మాత్రమే జరిగే అద్భుత సన్నివేశం ఇవాళ అంతరిక్షంలో కనిపించనుంది. చిన్న కొండ సైజులో ఉండే ఓ తోక చుక్క సోమవారం రాత్రి అంగారక గ్రహం వైపు దూసుకుపోనుంది. గంటకు లక్షా 26వేల కిలోమీటర్ల వేగంతో కుజగ్రహం వైపు పయనించనుంది. అయితే ఈ ఉల్క వల్ల అంగారకుడికి ఎలాంటి ప్రమాదం లేదని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చెప్పింది. మార్స్ పక్క నుంచి ఈ తోకచుక్క…. లక్షా 40 వేల కిలోమీటర్ల సమీపం నుంచి వెళ్లనుందని పేర్కొంది. ఈ సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క సౌర కుటుంబం అంతర్భాగంలోకి రావడం ఇదే తొలిసారి. మన దేశానికి చెందిన మామ్ ఈ అపురూప సన్నివేశాన్ని తన కెమేరాల్లో బంధించనుంది. నాసా పంపిన రోవర్లు ఆపర్చ్యూనిటీ, క్యూరియాసిటీ కూడా ఈ అద్భుత సన్నివేశాన్ని రికార్డు చేసేందుకు రెడీ అవుతున్నాయి. తోకచుక్క కారణంగా అంగారక గ్రహంపై దుమ్మూ, ధూళీ భారీగా వచ్చే అవకాశమున్నప్పటికీ…. అమెరికా రోవర్లు వాటిని ఫోటోలు తీస్తాయని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.

Leave a Comment