వన్డే మ్యాచ్ లలో ఐసిసి ప్రయోగం చేయబోతున్నది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక.. ఇప్పటికే క్రికెట్ లో అనేకరకాలైన మార్పులు జరిగాయి. అయితే.. ఇప్పుడు మరో మార్పుకు ఐసిసి శ్రీకారం చుట్టబోతున్నది. ఆస్ట్రేలియా..దక్షిణాఫ్రికా దేశాల మధ్య వన్డే మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో అంపైర్ సంభాషణలు గ్యాలరీలో కూర్చునే… ప్రేక్షకులకు వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం విజయవంతం అయితే.. వీటిని.. రాబోయే వరల్డ్ కప్ నుంచి అమలు చేస్తుంది. రివ్యూలు, ఔట్ కు సంబంధించిన అనుమానాలు అన్నీ ఇకనుంచి గ్యాలరీలో కూర్చుండే.. ప్రేక్షకులు కూడా వినే అవకాశాన్ని కల్పిస్తున్నది. ఈ కొత్త టెక్నాలజీకి ఐసిసి కూడా అనుమతి ఇచ్చింది. ఆస్ట్రేలియా… దక్షిణాఫ్రికా మ్యాచ్ లలో ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. తప్పకుండా దీనిని 2015 వరల్డ్ కప్ లో అమలు చేసే అవకాశం ఉన్నది.
Recent Comments