వాట్సాప్ విపరితంగా వాడుతున్నారట !

మొబైల్ మెసెంజర్ ‘వాట్సాప్’ మరో సంచలనం నమోదు చేసింది. ఈ అప్లికేషన్ వినియోగిస్తున్న వారి సంఖ్య 70 మిలియన్లు దాటింది. అంటే కోట్లకు పైగా భారతీయులు వాట్సాప్ వాడుతున్నారు. తమ వినియోగదారుల్లో పదిమందిలో ఒకరు భారతీయులే అని కంపనీ బిజినెస్ హెడ్ నీరజా అరోరా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా తమ అప్లికేషన్ 60కోట్లమంది వినియోగిస్తుండగా భారత్ లో ఈ సంఖ్య 7కోట్లను దాటిందన్నారు. అంటే సగటున పదిశాతం కంటే ఎక్కువ ఇక్కడి యూజర్లే ఉండటం సంతోషకరమన్నారు. వినియోగదారులకు చేరువయినందుకు సంతోషం వ్యక్తం చేసిన అరోరా.. త్వరలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రూప్ చాటింగ్, ఫొటో షేరింగ్ తో పాటు.., ఆఫ్ లైన్ మోడ్ సేవలు ఇతర అంశాలపై తాము దృష్టి పెట్టామన్నారు. వాట్సాప్ కు ప్రపంచంలో భారత్ పెద్ద మార్కెట్ అవుతోందనీ.. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ప్రజల అవసరాలకు తగినట్లు అప్లికేషన్ అభివృద్ధి చేస్తామన్నారు. తమ కంపనీ ప్రధానంగా ఇండియాతో పాటు బ్రెజిల్ ను లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. ఫేస్ బుక్ తమ సంస్థలో వాటా తీసుకున్నప్పటికీ.., సోషల్ మీడియా విభాగంలో తాము టాప్ లో ఉన్నామన్నారు. ఈ సందర్బంగా వాట్సాప్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మూడేళ్ళ క్రితం తాము వాట్సాప్ లో కొంత భాగం విక్రయించాలని భావించగా… ఇప్పుడు తమ వాటాల కోసం పోటి ఏర్పడిందన్నారు. కంపనీ వ్యాపారం కంటే తమ ప్రొడక్ట్ డెవలప్ మెంట్ పై దృష్టి పెట్టడం వల్లే విజయం సాధించామని చెప్పారు.

Leave a Comment