వాళ్ల విమానం వాళ్లకే!

aeroరియో: సొంతగడ్డపై ఈసారి కచ్చితంగా టైటిల్ గెలవాలన్న కసితో ఉన్న బ్రెజిల్ జట్టు కోసం అక్కడి ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లే చేస్తోంది. తమ ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికోసం ప్రత్యేకంగా ఒక బోయింగ్ 737 విమానాన్ని సిద్ధం చేసింది. ఇందులో కేవలం బ్రెజిల్ జట్టు ఆటగాళ్లు, సిబ్బంది మాత్రమే ప్రయాణిస్తారు. వీరికోసం విమానం లోపల అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చారు.

ఆ విమానానికి ప్రత్యేకంగా గ్రాఫిటీతో ఆర్ట్ వేయించారు. బ్రెజిల్ సంప్రదాయాన్ని ప్రతిబంబించే ఈ ఆర్ట్ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతుందని భావిస్తున్నారు. గ్రాఫిటీ కళాకారుల ద్వయం ఓజ్ జెమియోస్ ఇందుకోసం 1200 క్యాన్ల స్ప్రే పెయింట్‌ను వినియోగించారు. ఇక బ్రెజిల్ జట్టు జూన్ 12న మొదలయ్యే ప్రపంచకప్ కోసం ఇదే విమానంలో ప్రయాణించనుంది. జట్టులోని ఆటగాళ్లంతా ఈ విమానంలో ఎప్పుడెప్పుడు ప్రయాణిస్తామా అని ఆలోచిస్తున్నారట.

Leave a Comment