విజయవాడలో నోవొటెల్ వరుణ్ హోటల్…

రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని విజయవాడలో మొట్టమొదటి ఐదు నక్షత్రాల వసతి సౌకర్యం ఈ నెల 9 వ తేదీన ప్రారంభం కాబోతోంది.

బెంజ్ సర్కిల్ సమీపంలోని భారతీ నగర్ లో 2014 లో మొదలైన “నోవొటెల్ వరుణ్  విజయవాడ” ₹ 150కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది.

డిసెంబర్ 9 వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రాంభోత్సవం జరగనుందని యాజమాన్యం ప్రకటించింది

ప్రారంభ సన్నాహక విలేఖరుల సమావేశంలో వరుణ్ గ్రూప్ చైర్మన్ శ్రీ ప్రభు కిషోర్, నొవొటెల్ వరుణ్ జనరల్ మానేజర్ మధుపాల్ మరియు మాధవ్ పాల్గొన్నారు.

“దేశంలోని నోవొటెల్ వ్యాపార విస్తరణలో ఇది 20 వ శాఖగా ఉండబోతోంది. 202 విలాసవంతమైన గదులు, 25 ఆతిధ్య అపార్ట్మెంట్స్, 4 ఆహారశాలలు, 7 సమావేశ గదులు, 10 వేల చదరపు అడుగుల విందు మందిరం, అత్యాధునిక వ్యాయమశాల మరియు విశాలమైన పైకప్పు ఈత కొలను ప్రత్యేకతలుగా ఉండబోతున్నాయి.సౌరవిద్యుత్ వంటి అనేక ప్రకృతి అనుకూల వ్యవస్థలతో ఈ హోటల్ సదుపాయాలను నిర్వహించనున్నాము.

అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ హోటల్ కేవలం 25 నిమిషాల దూరంలోనూ, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంది.

వరుణ్ సంస్థ తదుపరి కార్యాచరణలో, అమరావతి రాజధాని ప్రాంతంలో మరొక అంతర్జాతీయ ఆతిధ్య శాఖ కోసం కూడా మా వద్ద ప్రణాళిక ఉంది” అని ప్రభు కిషోర్ ఈ సందర్భంగా ప్రకటించారు.



 

 

Leave a Comment