విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం

rగోపేశ్వర్ : విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే చిన్నారి విద్యార్థిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ దారుణ సంఘటన ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో చోటు చేసుకుంది. చదువుకునేందుకు పాఠశాలకు వచ్చిన విద్యార్థిపై అత్యాచారం చేశారు. అనంతరం అతడు పరారైయ్యాడు. ఆ చిన్నారి బాలిక జరిగిన విషయాన్ని తన సంరక్షకులకు వెల్లడించింది.

దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అనసూయ ప్రసాద్ తీవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా అనసూయ ప్రసాద్ను గురువారం అరెస్ట్ చేసినట్లు కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు విధించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు నాలుగో తరగతి చదువుతుందని పోలీసులు వెల్లడించారు.

Leave a Comment