అందాల తార అంజలిపై గత కొంత కాలంగా ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. బాగా పీక్‌లో ఉన్న ఆమె పై తొలుత తన పిన్ని తో ప్రారంభమైన వివాదాల
పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ కారణంగా ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉండడం లాభదాయకంగా ఉంటే.. మరో వైపు ఆమె మంచి ఛాన్సులు మిస్ అవుతున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా అంజలిపై తాజాగా తమిళ కమెడియన్ సతీష్ ను వివాహం చేసుకుందని ఒక్కసారిగా కోలీవుడ్ లో ప్రచారం మొదలైంది. ఇటీవలి కాలంలో సతీష్ కమెడియన్‌గా బాగా ఎదుగుతున్నాడు. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు.
అంజలితో పెళ్లటగా అని ఈ తమిళ నటుడి వద్ద ప్రస్తావిస్తే, పెద్దగా నవ్వేస్తూ, “అసలు అంజలిని నేనింత వరకు ఒక్కసారి కూడా కలవలేదు. ఆమెను సినిమాలలో చూడడం తప్ప ఆమెతో నాకు అసలు పరిచయమే లేదు. మరి, ఈ వార్తని ఎవరు పుట్టించారో!” అంటున్నాడు.
దీన్ని బట్టి చూస్తే అంజలి అంటే గిట్టనివారెవరో ఇలాంటి రూమర్లు సృష్టిస్తూ ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. కాగా సతీష్ పెళ్లి అంశాన్ని అంజలి ఖండించిన విషయం తెలిసిందే. ఇక ఈ అమ్ముడు ఎప్పుడు ఈ రూమర్ల ఊబిలో నుంచి బయటపడుతుందో మరి..!
Recent Comments