విశాఖకు బయలుదేరిన సీఎం

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు, అక్కడి నుండి రోడ్డుమార్గం ద్వారా  విశాఖ కు వెళ్లనున్నారు. హుదూద్ తుపాన్ నేపథ్యంలో  విశాఖలో పరిస్థితి  అస్తవ్యస్తంగా మారడంతో తానే స్వయంగా పరిశీలించాలని చంద్రబాబునిర్ణయించుకున్నారు.ప్రయాణం సురక్షితం కాదని అధికారులు సీఎంకు సూచించగా ,అవకాశం ఉన్నంత వరకు రోడ్డుమార్గాన వెళ్తానని చంద్రబాబు తెలిపారు.

Leave a Comment