వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలి

61401966077_625x300హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తుండటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సభ కోసం పేదల ఇళ్లు కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాల్సిందేనని, తొలి సంతకం చేసే ఫైలులో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలుపై టీడీపీ నేతలు స్పష్టత ఇవ్వాలని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.


కొత్త రాజధాని నిర్మాణం కోసం ఓ వైపు నిధులు వసూలు చేస్తూ.. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తుండటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తప్పుపట్టారు. అయితే వైఎస్ జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం తగదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రమోహన్ రెడ్డి దష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గానికి టీడీపీ ఎంత ఖర్చు చేసిందో చంద్రబాబు ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

Leave a Comment