శాంత్రో కార్లకు వీడ్కోలు

కొరియన్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌కి ఇండియాలో ఘనమైన గుర్తింపును తెచ్చిన శాంత్రో కార్లు మార్కెట్ నుంచి కనుమరుగు కానున్నాయి. 1990 దశకంలో భారత్‌లోకి ప్రవేశించిన శాంత్రో కార్లు మారుతి-800కి ప్రధాన పోటీగా నిలిచాయనడంలో సందేహం లేదు. ఈ మోడల్ కార్లకు వీడ్కోలు పలకాలని హ్యుందాయ్ నిర్ణయించింది. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. ఇప్పటికే 13.6 లక్షల యూనిట్లను ఇండియాలో, 5.3 లక్షల యూనిట్లను విదేశాల్లో విక్రయించామని అయన తెలిపారు. ప్రస్తుతం నెలకు కేవలం 3 వేల శాంత్రో యూనిట్లు మాత్రమే అమ్ముడవుతున్నాయని పేర్కొన్నారు. నిల్వ ఉన్న శాంత్రో స్టాక్స్ అయిపోయే వరకు అమ్మకాలు సాగిస్తామని తెలిపారు. కాగా మారుతి సుజుకి సంస్థ సైతం తమ బ్రాండ్ ‘మారుతి-800’కు వీడ్కోలు పలుకగా, హిందూస్తాన్ మోటార్స్ ‘అంబాసిడర్’ తయారీని ఇప్పటికే నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Leave a Comment