శ్రీశైలం వివాదం కొలిక్కి

శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పాదన విషయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గత కొన్నిరోజులుగా రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగ.. ఈ రోజు కృష్ణాజలాల యాజమాన్య బోర్డ్ అత్యవసరంగా సమావేశం అయింది. శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పాదన కోసం నీటిని వాడుకునే విషయంలో బోర్డు చర్చలు జరిపింది. నవంబర్ 2 వరకు శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పాదన జరుపుకునేందుకు బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ ఉత్పాదన కోసం 3 టిఎంసిల నీటిని ఉపయోగించుకునేందుకు బోర్డు తెలంగాణకు అనుమంటి ఇచ్చింది. నవంబర్ నుంచి విధ్యుత్ డిమాండ్ తగ్గుతుందని.. బోర్డు పేర్కొన్నది. ఈ విషయమై 15రోజుల తరువాత మరల చర్చిస్తామని బోర్డు తెలియజేసింది. బోర్డు తమ నిర్ణయాన్ని ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు తెలిపింది.

Leave a Comment