షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి.. లేదంటే ..

2హైదరాబాద్ : రైతుల రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ షరతులు విధించడం అన్యాయమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ సభపక్ష నేత డీఎస్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం షరతులు విధించడం రైతులను ఓ విధంగా మోసం చేయడమేనని విమర్శించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాల్సిందేనని ఆయన సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. గురువారం డీఎస్ హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

ఎన్నికల ముందు రుణమాఫీ అని గెలిచిన తర్వాత షరతులు విధించడం ఎంత వరకు సమంజసమని ఆయన ఈ సందర్భంగా కేసీఆర్ని డీఎస్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే రైతు రుణామాఫీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ తొలి హమీ ఇచ్చిందని డీఎస్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇచ్చిన హమీని అమలు పరచకుండా మాట తప్పితే తెలంగాణ ప్రభుత్వానికి సహకరించమని డీఎస్ హెచ్చరించారు. ఎటువంటి షరతులు లేకుండా రూ. లక్ష రూపాయల రుణమాఫీ చేయాలిని కేసీఆర్ ప్రభుత్వాన్ని డీఎస్ డిమాండ్ చేశారు.

Leave a Comment