షరపోవా.. ఓ మంచి టీ బ్యాగ్!!

maరష్యన్ అందాల టెన్నిస్ తార మారియా షరపోవా తెలుసు కదూ.. ఆమె మంచి టీ బ్యాగ్ లాంటిదని, వేడి వేడి నీళ్లలో ఆమెను వేస్తే ఆమె ఎంత స్ట్రాంగో తెలుస్తుందని ఆండీముర్రే తల్లి జూడీ ముర్రే వ్యాఖ్యానించారు. అయితే దీనిపై షరపోవా మండిపడింది. అసలు జూడీ ముర్రే ఎవరో కూడా తనకు తెలియదని చెప్పేసింది.

రోలండ్ గారోస్ మైదానంలో ఫ్రెంచి ఓపెన్ సెమీఫైనల్లోకి వెళ్లిన తర్వాత విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రస్తావన రాగా.. ఆమె ఈ రకంగా సమాధానమిచ్చింది. తాను టీ బాగానే తాగుతానని, అయినా ఆమె అసలు ఏం చెప్పాలనుకుందో తనకు అర్థం కాలేదని అంది.

Leave a Comment