షేక్ చేస్తున్న బన్నీ సినిమా బడ్జట్ !

ఒక వైపు ఈమధ్య కాలంలో వచ్చిన టాప్ హీరోల సినిమాల బడ్జెట్ పెరిగిపోయి సరైన హిట్స్ లేక నిర్మాతలందరూ ఆర్ధిక సమస్యల మధ్య చిక్కుకుని సమస్యల వలయంలో కూరుకు పోయిన నేపధ్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల సినిమాకు ఆ సినిమా నిర్మాతలు పెడుతున్న మితి మీరిన ఖర్చు టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాతలను కూడా షేక్ చేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాలో సమంత, నిత్యా మీనన్, ఆదా శర్మ హీరోయిన్ల గా నటిస్తూ ఉండటం తోపాటు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అదేవిధంగా ఒకనాటి హీరోయిన్ స్నేహాలు నటిస్తూ ఉండటంతో దర్శకుడి దగ్గర నుంచి ఈ టాప్ స్టార్ ల లిస్టుతో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ను కూడా కలుపుకుంటే వీరందరి పారితోషికాలకు నిర్మాతకు దాదాపు 30 కోట్లు వరకు బడ్జెట్ అవుతుందని విశ్లేషకుల అంచనా.  దీనితో పాటు ప్రొడక్షన్ కాస్టును కూడా కలుపుకుంటే మొత్తం ఈ సినిమా పై నిర్మాత పెట్టుబడి దాదాపు 55 కోట్లు దాటి పోతుందని అంచనాకు వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సంవత్సరం సూపర్ హిట్ గా కలక్షన్స్ కురిపించిన అల్లుఅర్జున్ ‘రేసు గుర్రం’ కలక్షన్స్ కూడా 59 కోట్లు దాటని నేపధ్యంలో ఏ ధైర్యం చూసుకుని అల్లుఅర్జున్ సినిమాకు ఇంత భారీ పెట్టుబడి పెడుతున్నారు అనే విశ్లేషణలు వినపడుతున్నాయి.  రేసు గుర్రం స్థాయిని మించి బన్నీ త్రివిక్రమ్ ల సినిమా సూపర్ హిట్ చేయాలన్న తలంపు మంచిదే అయినా పెరిగి పోతున్న ఈ పోటీ వాతావరణంలో ఈ సినిమాను కొనుక్కునే బయ్యర్లు అదేవిధంగా ఈ సినిమా నిర్మాతలు మితిమీరిన విశ్వాసంతో వ్యవహరిస్తున్నారేమో అంటూ గట్టి మాటలు వినపడుతున్నాయి.

Leave a Comment