సచిన్ గౌరవార్ధం అరుదైన నాణెం విడుదల

Sachin Tendulkarలండన్: క్రికెట్ రంగానికి సచిన్ అందించిన సేవలకు గుర్తుగా బ్రిటన్ కు చెందిన వ్యాపారస్థంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓ అరుదైన బంగారు నాణాన్ని విడుదల చేసింది. సచిన్ గౌరవార్ధం 12 వేల పౌండ్ల స్టెర్లింగ్ విలువ కలిగిన నాణానికి పూర్తి చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉంటాయని ఈస్ట్ ఇండియా కంపెనీ వెల్లడించింది.
24 ఏళ్ల కెరీర్ లో క్రికెట్ కు అత్యత్తమ సేవలందించినందుకుగాను అరుదైన నాణాన్ని విడుదల చేసామని ఈస్ట్ ఇండియా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అతి తక్కవ మంది మాత్రమే ఇప్పటి వరకు చూసిన 200 గ్రాముల బరువుతో ఉండే 210 బంగారు నాణాలు విడుదల చేశామన్నారు.
అందమైన బాక్సులో అమర్చిన నాణెంతోపాటు అధికారిక ధ్రువపత్రంతోపాటు సచిన్ ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్ ను అందిస్తున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ రంగానికి తాను చేసిన సేవలకు గుర్తింపుగా దక్కిన గొప్ప గౌరవం అని సచిన్ టెండూల్కర్ అన్నారు.
భారత జట్టుకు ఆడాలని కలలు కనేవాడిని. 24 ఏళ్లపాటు క్రికెట్ రంగానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టం. క్రికెట్ రంగానికి అందించిన సేవలకు గుర్తుగా అరుదైన బంగారు నాణాన్ని విడుదల చేయడం నాకు లభించిన గొప్ప గౌరవం అని సచిన్ అన్నారు.

Leave a Comment