సచిన్ చెప్పినవన్నీ అబద్దాలేనట !

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ మార్కెట్లోకి రాకముందే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. అందులో భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పై సచిన్ చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి.  తన పుస్తకంలో చాపెల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన సచిన్.. అతణ్ని ‘రింగ్ మాస్టర్’గా అభివర్ణించాడు. ‘ఆటగాళ్లు సౌకర్యంగా ఉన్నారో లేదో తెలుసుకోకుండా వారిపై ఆలోచనలు రుద్దిన రింగ్‌మాస్టర్ చాపెల్. రాహుల్ ద్రవిడ్ నుంచి కెప్టెన్సీ అందుకోవాలని తనకు గ్రెగ్ సూచించాడని, ‘ఇద్దరం కలిసి ఏళ్లపాటు భారత క్రికెట్‌ను శాసించొచ్చు’ అన్న అతని మాటలు విని దిగ్భ్రాంతికి గురైయ్యనని అన్నాడు సచిన్. భారత జట్టు కెప్టెన్‌కు కోచ్ ఏమాత్రం గౌరవం ఇవ్వకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిదని. నన్ను ఒప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించాడని, అందుకు తానూ ససేమిరా అన్నానని రాసుకొచ్చాడు  సచిన్. సచిన్ తన జీవిత కాలంలో తొలిసారిగా చేసినీ విమర్శలు .. ఇటు టీం ఇండియా తో పాటు వరల్డ్ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారాయి. కాగా, ఈ తనపై సచిన్ చేసిన ఆరోపణలను గ్రెగ్ ఖండించాడు. తన ఆత్మకథలో సచిన్ వెల్లడించిన అంశాలన్నీ అసత్యాలని, ద్రావిడ్ ను తప్పించాలని తానెప్పుడూ ప్రయత్నం చేయలేదని, అంతేకాకుండా, సచిన్ ను కెప్టెన్ గా ఉండాలని కూడా తానెప్పుడూ కోరలేదని అంటున్నాడు గ్రెగ్. అయితే, చాపెల్ వాదనను నమ్మే పరిస్థితి లేదు.  2005 నుంచి 2007 వరకు భారత జట్టు కోచ్‌గా పని చేసిన చాపెల్ అనేక వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. ఆటగాళ్ళ మధ్య  విభజన తీసుకొచ్చి, క్రికెట్ లో గ్రూప్ రాజకీయాలు చేసినట్లు చాపెల్ పై ఆరోపణలు వున్నాయి. 2007 వరల్డ్ కప్ లో ఘోర పరాజయం, ఆటగాళ్ళ మధ్య సమన్వయమ లోపించడానికి చాపెల్ ప్రధాన కారకుడని క్రికెట్ విశ్లేషకులు, మాజీలు అభిప్రాయపడుతుంటారు. పైగా, ఈ విమర్శలు చేసింది సచిన్. వివాదాలకు ఆయన ఆమడదూరం. క్రికెట్‌ చరిత్రలో తనకు మాత్రమే సాధ్యమైన  రికార్డుల్ని నమోదు చేసిన సచిన్‌ టెండూల్కర్‌, ఎవర్నీ ఎప్పుడూ ఎక్కడా విమర్శించిన దాఖలాల్లేవు. ఎవరు తనను విమర్శించినా, వారికి తన బ్యాట్  సమాధానమిచ్చిన లెజెండ్. అలాంటి సచిన్ కు ఇప్పుడు అసత్యాలు ప్రచారం చేయాల్సినవసరం ఏంటని అభిమానులు అంటున్నారు. కాగా, సచిన్ వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ గంగూలీ స్పందించాడు. చాపెల్ నమ్మదగ్గ వ్యక్తి కాదన్నాడు. తాను 2005 డిసెంబరులో కెప్టెన్సీ కోల్పోతే రాహుల్ కెప్టెనయ్యాడని,  కానీ ఎనిమిది నెలల సమయంలో చాపెల్‌కు మరో కెప్టెన్ (సచిన్) అవసరమయ్యాడు. అతని ఆలోచనలు ఎలా ఉన్నాయో, భారత క్రికెట్‌కు అతడెంత నష్టం చేశాడో దీన్నిబట్టి అర్థమవుతుందన్నాడు. మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లాలనుకోవట్లేదని,  భారత క్రికెట్ ఎదుర్కొన్న గడ్డుకాలాల్లో చాపెల్ కోచింగ్ ఒకటని అభిప్రాయపడ్డారు సౌరబ్.

Leave a Comment