సన్నిహితుడిని కొల్పోయాను: మోడీ

5న్యూఢిల్లీ : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపినాథ్ ముండే మృతి దేశానికి, ప్రభుత్వానికి, పార్టీకి తీరని లోటని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గోపీనాథ్ ముండే నిజమైన ప్రజానాయకుడని ఆయన అభివర్ణించారు. వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా ఆయన సేవలు మరువరానివని ముండే సేవలను మోడీ కొనియాడారు. ముండే మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ముండే తనకు అత్యంత ఆప్తుడు, సహచరుడుని కొల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
కేబినెట్లో చేరి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజులకే ఇలా జరగడం తీవ్ర విషాదమని పేర్కొన్నారు. ముండే కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు పార్టీ అండగా ఉంటుందని నరేంద్ర మోడీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కేంద్రమంత్రి గోపినాథ్ ముండే మృతి పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపాన్ని తెలిపారు.


న్యూఢిల్లీలో ఎయిర్పోర్ట్కు వెళ్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి గోపీనాథ్ ముండే (64)ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు మృతి చెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. ఈరోజు ఉదయం 6.30 గంటలకు గోపీనాథ్ ముండే ఢిల్లీ నుంచి ముంబయి వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దాంతో ఆయన్ని చికిత్స నిమిత్తం ఎయిమ్స్కు తరలించారు. వైద్యులు  చికిత్స అందిస్తుండగా గుండెపోటుతో గోపీనాథ్ ముండే మరణించారు.

Leave a Comment