సమంత గురించి సిద్దార్థ్ ఏం చెప్పారంటే…

61397848479_625x300హీరో సిద్దార్ద్, హీరోయిన్ సమంతల మధ్య రిలేషన్ గురించి మీడియాలోనూ, వెబ్ సైట్లలోనూ అనేక రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారి రిలేషన్ పై ఎన్నివార్తలు, కథనాలు వచ్చినా సమంత, సిద్దార్థ్ లు పెదవి విప్పలేదు.
అయితే తాజాగా చిక్కడు దొరకడు చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సిద్దార్ట్ నోట సమంత పేరు రావడంతో అభిమానుల్లో జోష్ కలిగించింది.
చిక్కడు దొరకడు చిత్రంలో నటించిన హీరోయిన్ గురించి మాట్లాడుతూ… తెలుగు సినిమాల్లో వరుస విజయాలను సొంత చేసుకుంటూ సమంత ఎలా క్రేజీ హీరోయిన్ గా ఉందో.. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో హిట్ పై హిట్ సాధిస్తూ లక్ష్మీ మీనన్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారని సిద్దార్థ్ అన్నారు.
సమంతపై సిద్దార్థ్ పై ప్రశంసలు కురిపించడంతో కార్యక్రమానికి హాజరైనందరూ ఇంకా ఏమైనా చెబుతారోనని ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే సమంతపై పొగడ్తల వరకే సిద్దార్థ్ పరిమితమయ్యారు.

Leave a Comment