సర్రోగసి ద్వారా తల్లైన మంచు లక్ష్మీ

Manchu Lakshmiప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుమార్తె, సినీ తార లక్ష్మీ ప్రసన్న సర్రోగసి ద్వారా ఓ బిడ్డకు తల్లైంది.  సర్రోగసి విధానం ద్వారా లక్ష్మి తల్లైనట్టు మోహన్ బాబు అధికారికంగా ట్విట్టర్ లో కూడా పేర్కొన్నారు.
తన కూతురు తల్లి కావడం పట్ల మోహన్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. మంచు కుటుంబంలో పండుగ వాతావారణం నెలకొన్నట్టు తెలుస్తోంది.  నా ప్రియమైన సోదరికి సర్రోగసి ద్వారా ఆడకూతురు పట్టింది. మామగా నాకు ప్రమోషన్ లభించింది అని మంచు మనోజ్ ట్విటర్ లో ట్వీట్ చేశారు.
“రేపు మధ్నాహ్నం ఓ ముఖ్యమైన విషయాన్ని ప్రకటించబోతున్నా. నాకు, నా కుటుంబానికి అది చాలా ఆనందకరమైన వార్త” అంటూ నిన్న (14.06.) డా. మోహన్ బాబు తన ట్విట్టర్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. సర్రోగసి అంటే అద్దె గర్బం ద్వారా పిల్లల్ని కనే విధానం. ఇటీవల బాలీవుడ్ లో షారుక్ దంపతులు సర్రోగసి విధానం ద్వారా బిడ్డను కన్నారు.

Leave a Comment