సహాయక చర్యల్లో పాల్గొనండి

ఉత్తరాంధ్రలో హుదూద్ తుపాన్ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రభుత్వం ప్రారంభించిన జన్మభూమిని రెండు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఏపీ సచివాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తుపాను బాధితులను ఆదుకునేందకు సాయంత్రం విశాఖలో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. తుపాను బాధితులను ఆదుకున్న వారిని గుర్తిస్తామని, ప్రతి ఒక్కరు సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

Leave a Comment