సాకర్ 2014 ఫైనల్ కు మోడీకి బ్రెజిల్ ఆహ్వానం!

FIFA-2014న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీకి అరుదైన ఆహ్వానం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్న సాకర్ 2014 ఫైనల్ పోటిని వీక్షించాలని మోడీకి ఫీఫా ఆహ్వానం పంపింది.
బ్రెజిల్ ప్రభుత్వం నుంచి ప్రధాని మోడీకి అందిన ఆహ్వానం వార్త  గురించి పీఎంవో కార్యాలయం ధృవీకరించింది.
ఫీఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌ తిలకించాలని ఆహ్వానంలో పేర్కొన్నారు. జులై 13న ఫీఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్‌ జరుగుతుంది. భూటాన్ పర్యటనలో ఉన్న మోడీ బ్రెజిల్ ఆహ్వానంపై ఇంకా స్పందించలేదు.

Leave a Comment