సాహస కన్య-సాగర వీరుడు.. ఇదో 1965 ప్రేమకథ

Margaret Howe Lovattజంతువులు మానవులను ప్రేమిస్తాయా? ఇద్దరి మధ్య ప్రేమ సాధ్యమేనా? ఓ మహిళా శాస్త్రవేత్త మాత్రం సాధ్యమేనని చెబుతున్నారు. స్వయంగా తనకే ఈ అనుభవం ఎదురైందని వెల్లండించారు. మగ డాల్ఫిన్ తనతో ప్రేమలో పడటమే కాదు శృంగారపరమైన ఉత్తేజం కూడా పొందిందని చెప్పారు. ఈ కథ పూర్తిగా తెలుసుకోవాలంటే 1965 కాలం నాటికి వెళ్లాల్సిందే. ఈ నిజ జీవిత కథను బీబీసీ ‘డాల్ఫిన్స్తో మాట్లాడే యువతి’ పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది.

అప్పట్లో మార్గరెట్ హొవీ లొవెట్ అనే శాస్త్రవేత్త వయసు 23 ఏళ్లు. నాసా ప్రయోగాత్మక కార్యక్రమంలో భాగంగా వర్జిన్ ద్వీపానికి ఆమె వెళ్లారు. అక్కడ పీటర్ అనే మగ డాల్ఫిన్కు ఇంగ్లీష్ నేర్పడం ఆమె బాధ్యత. సముద్ర జంతువుల్లో డాల్ఫిన్లు చాలా తెలివైనవి. రామ చిలుకల్లాగా ఉచ్చరించగలవు. ఇక అసలు విషయానికొస్తే పీటర్, లొవెట్కు మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ కలసి భోజనం చేసేవారు. స్నానం చేయడంతో పాటు కలసే నిద్రించేవారు. ఇలా కొంతకాలం గడిచే సరికి మగ డాల్ఫిన్ లొవెట్తో ప్రేమలో పడింది. అంతేగాక శృంగారపరమైన భావనలతో ఉత్తేజం పొందేది. ‘పీటర్ నాతో గడపడానికి ఇష్టపడేది. నా మోకాలు, పాదం, చేతులు తాకేది. ఈ చర్యలకు అడ్డు చెప్పలేదు. ఇద్దరం శృంగారంలో పాల్గొనలేదు కానీ నా మనసుకు హాయిగా అనిపించేది’ అని నాటి సంగతులను లొవెట్ చెప్పారు. ఈ డాక్యుమెంటరీ ఈ నెల 17న బీబీసీ4లో ప్రసారం కానుంది.

Leave a Comment