సింగపూర్ పర్యటనలో చంద్రబాబు..

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 11 నుంచి 14 వరకు చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. దక్షిణాసియా సదస్సుకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. పలు వాణిజ్య, వ్యాపార సదస్సుల్లో పాల్గొననున్నారు. మంత్రులు నారాయణ, యనమల, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు చంద్రబాబు వెంట సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు.

Leave a Comment