సింగపూర్ రిటర్న్ టికెట్ ఉచితం

  • Singapore టైగర్‌ఎయిర్ స్పెషల్ ఆఫర్
  • ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకే

ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు సింగపూర్ చౌక ధరల విమానయాన సంస్థ టైగర్‌ఎయిర్,  ప్రత్యేకమైన ఆఫర్‌ను ఇస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్, ప్రి-పెయిడ్ కార్డుదారులు సింగపూర్ వెళ్లడానికి టికెట్ తీసుకుంటే రిటర్న్ టికెట్ ఉచితమని (ఎయిర్‌పోర్ట్ పన్నులు, ఇతర చార్జీలు చెల్లించాలి) టైగర్‌ఎయిర్ డెరైక్టర్(కమర్షియల్) రాబర్ట్ యంగ్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోచి, తిరువనంతపురం, తిరుచిరాపల్లి నగరాల నుంచి సింగపూర్‌కు ప్రయాణించే తమ విమాన సర్వీసులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు.
జూన్ 16 నుంచి జూలై 6 వరకూ ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 14 నుంచి అక్టోబర్ 31 వరకూ, అలాగే వచ్చే ఏడాది జనవరి 19 నుంచి మార్చి 26 వరకూ ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కొత్త అనుబంధం మొదలైన సందర్భంగా ఆ బ్యాంక్ ఖాతాదారులకు ఈ ప్రత్యేక ఆఫర్‌ను ఇస్తున్నామని రాబర్ట్ యంగ్ పేర్కొన్నారు. ఈ సంస్థ ఈ ఆరు నగరాల నుంచి సింగపూర్‌కు వారానికి 44 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది.

Leave a Comment