సినిమా ఛాన్స్ ఇస్తానని పలుమార్లు రేప్ చేశాడు: ఈవెంట్ మేనేజర్‌పై నటి

సినిమా పేరుతో మోసం చేసిన మరో ఉదంతం వెలుగులోకి చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ సినిమా పరిశ్రమలో నిలదొక్కుకుంటున్న ఓ నటి మహారాష్ట్ర రాజధాని ముంబైలో అత్యాచారానికి గురయింది. ఈ సంఘటన కలకలం రేపింది. సినిమాలలో అవకాశం కల్పిస్తానని చెప్పిన ఓ వ్యక్తి తన పైన అత్యాచారానికి ఒడిగట్టినట్లుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను సబర్బన్ చార్ కోప్ నిర్వహిస్తున్న ఈవెంట్ ప్రోగ్రామ్స్‌కు వెళ్లిన క్రమంలో అక్కడికి వచ్చిన ముఫ్దాల్ ఘడియాలి అనే వ్యక్తి నమ్మించి మోసం చేశాడని చెప్పింది. ముఫ్దాల్ తనను సబర్బన్ ద్వారా పరిచయం చేసుకున్నాడని, త్వరలో ఓ సినిమా తీయబోతున్నట్లు చెప్పాడని, కొన్ని రోజుల క్రితం సినిమాలో అవకాశంలో ఇస్తానని చెప్పి ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడని పేర్కొంది. సినిమాకు సంబంధించిన కాంటాక్ట్ పైన సంతకం చేయాల్సి ఉందని చెప్పడంతో తాను అతని ఇంటికి వెళ్లానని తెలిపింది.

ఆ క్రమంలో ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడని, అటు తర్వాత తాను స్పృహ కోల్పోయానని, చాలాసేపటికి మెలకువ వచ్చిందని, అప్పుడు తన పైన అత్యాచారం జరిగినట్లుగా గ్రహించానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనను పలుమార్లు వివిధ హోటళ్లకు తీసుకెళ్లి వేధించాడని పేర్కొంది. ఆ తర్వాత తనను కలవద్దని, కాంట్రాక్ట్ అవసరం లేదని చెప్పింది. తననుగత ఏడాది డిసెంబర్ నెలలో అతను మొదటిసారి కలిశాడని చెప్పింది. గురువారం సాయంత్రం ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ఈవెంట్ మేనేజర్ పైన సబర్బన్ చార్ కోప్‌ను అదుపులోకి తీసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.

Leave a Comment