సివిల్ గరిష్ఠ వయోపరిమితి కుదింపు…!

సివిల్స్ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏఆర్సీ సిఫార్సుల మేరకు ఈ సంస్కరణలను 2015 నుంచి అమలు చేస్తామని కేంద్ర సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పింఛన్ల శాఖ తెలిపింది. పాలన సంస్కరణలు, ప్రజాపిర్యాదులు విభాగం వెబ్ సైట్ ప్రకారం పరిక్షరాసే అవకాశాల్ని కూడా తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2015లో సివిల్స్ కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే బహిరంగ విభాగంలో 26 ఏళ్లు గరిష్ఠ వయోపరిమితిగా ఉండనుంది. ఓబీసీలకు 28, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 29గా ఉండనుంది. పరీక్ష రాసే అవకాశాలనూ బహిరంగ విభాగంలో మూడుసార్లు, ఓబీసీకి ఐదు, ఎస్సీ ఎస్టీలకు ఆరుసార్లు అవకాశం కలిగించనున్నారు. మరో వైపు కేంద్ర సిబ్బంది శిక్షణ, వ్యవహారాల శాఖ దీని అమలుపై ఎలాంటి నోటిఫికేషన్ ను విడుదల చేయలేదు. మరో వైపు ప్రతీ సంవత్సరం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి సుమారు 4 లక్షల మంది వరకూ ఈ పరీక్షకు దరఖాస్తు చేస్తారు. ఇందులో ఒక్క హైదరాబాద్ నుంచే సుమారు 60 వేలమంది దాకా ఆశావాహులు ఉంటున్నారు. ఇందులో హైదరాబాద్ నుంచే సుమారు 60 వేలమందిదాకా ఆశావాహులు ఉంటున్నారు. వయోపరిమితి కుదింపుతో వీరి సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది.

Leave a Comment