సీమాంద్రలో 74 శాతం పోలింగ్ నమోదు

హైదరాబాద్: సీమాంధ్రలో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సీమాంధ్రలోని 25 లోకసభ స్థానాలకు, 175 శాసనసభ స్థానాలకు పోలింగ్ మొదలైంది. దాదాపు 3.68 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. లోకసభ స్థానాలకు 333 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, శాసనసభ స్థానాలకు 2,243 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 40,708 పోలింగ్ కేద్రాలను ఏర్పాటు చేశారు. 164 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ జరుగుతుంది. మిగతా స్థానాల్లోని కొన్నింటిలో 4 గంటల వరకు, మరికొన్నింటిలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.బుధవారం సాయంత్రం 5 గంటల వరకు సీమాంధ్రలో 74 శాతం నమోదైంది. తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో 72 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది.

Leave a Comment