సీమాంధ్రలో ముగిసిన పోలింగ్ సమయం

హైదరాబాద్: సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. అరకు, పాడేరు, రంపచోడవరం తదితర పది నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియగా మిగిలిన 165 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆరుగంటలకు పోలింగ్ ముగిసింది. సమయం ముగిసినా చాలాచోట్ల క్యూలైన్లలో ఓటర్లు బారులు తీరి ఉన్నట్లు సమాచారం. సాయంత్రం ఆరుగంటలవరకు క్యూలైన్లో ఉన్నవారందరూ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సాయంత్రం ఐదు గంటలవరకు సుమారుగా 71 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Comment