సీమాంధ్రలో సైకిల్ జోరు, తెలంగాణలో హస్తం హవా

హైదరాబాద్:మున్సిపాలిటీ ఎన్నికల్లో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ సైకిల్ జోరు కనిపించగా, తెంలగాణలో కాంగ్రెసు హస్తం హవా కనిపించింది. సీమాంద్రలో కాంగ్రెసు ఖాతా తెరవలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సీమాంద్రలో Municipal pollsనిరాశే ఎదురైంది. తెలంగాణలో ఊహించినట్లుగానే టిడిపి తన సత్తా చాటలేకపోయింది. తెరాసకు కాస్తా ఊరట మాత్రమే లభించింది.
రంగారెడ్డి జిల్లాలో రెండు మున్సిపాలిటీలను టిడిపి, మరో రెండు మున్సిపాలిటీలను కాంగ్రెసు గెలుచుకున్నాయి. ఒకటి హంగ్ ఏర్పడింది.
శ్రీకాకుళం జిల్లాలో వైకాపా, టిడిపి రెండేసి మున్సిపాలిటీలను దక్కించుకున్నాయి
తూర్పుగోదావరి జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు టిడిపికి దక్కాయి. ఏడింట హంగ్ వచ్చింది.
విశాఖపట్నం జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో టిడిపి విజయం సాధించింది.
నెల్లూరు జిల్లాలో రెండు టిడిపికి, ఒక్కటి వైసిపికి దక్కాయి. మూడింట హంగ్ వచ్చింది.
విజయవాడ కార్పోరేషన్ టిడిపి ఖాతాలో చేరింది.
గుంటూరు జిల్లాలో 11 మున్సిపాలిటీలు టిడిపికి దక్కగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక్క మున్సిపాలిటీలోనే విజయం సాధించింది.
ప్రకాశం జిల్లాలో ఆరు మున్సిపాలిటీల్లో నాలుగు టిడిపికి, వైసిపి రెండు మున్సిపాలిటీల్లో విజయం సాధించింది.
సీమాంద్రలోని 92 మున్సిపాలిటీల్లో టిడిపి 64, వైయస్సార్ కాంగ్రెసు 19 మున్సిపాలిటీలు దక్కాయి. 9 హంగ్ ఏర్పడ్డాయి. కాంగ్రెసు ఖాతా తెరవలేదు.
తెలంగాణలోని 53 మున్సిపాలిటీల్లో కాంగ్రెసుకు 23, తెరాసకు 9 దక్కాయి. 6 టిడిపికి దక్కాయి. బిజెపికి రెండు, మజ్లీస్‌కు ఒక మున్సిపాలిటీలు వచ్చాయి.
కృష్ణా జిల్లాలోని గుడివాడలో వైయస్సార్ కాంగ్రెసు విజయం సాధించింది. మచిలీపట్నం మాత్రం టిడిపికి దక్కింది.
తూర్పు గోదావరి జిల్లాలో 7 మున్సిపాలిటీలు టిడిపికి వచ్చాయి. మూడింటిలో హంగ్ ఏర్పడింది.
వైయస్ జగన్ సొంత జిల్లా కడపలోని ఏడు మున్సిపాలిటీల్లో నాలుగు టిడిపి కైవసం కాగా, వైయస్సార్ కాంగ్రెసుకు మూడు మాత్రమే దక్కాయి.
నెల్లూరు జిల్లాలో మూడు టిడిపికి, ఒక్కటి వైకాపాకు దక్కగా, మూడు హంగ్ వచ్చాయి.
అనంతపురం జిల్లాలోని 11 మున్సిపాలిటీలను కూడా టిడిపి దక్కించుకుంది. ఇతర పార్టీలకు ఒక్కటి కూడా దక్కలేదు.
సీమాంధ్రలో అత్యధిక మున్సిపాలిటీలను, కార్పోరేషన్లను సాధించడంతో తెలుగదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.
రామచంద్రపురం మున్సిపాలిటీలో తెలుగుదేశం అత్యధిక స్థానాలు గెలుచుకుంది, అయితే చైర్మన్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.
ఆళ్లగడ్డ, గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెసు వశమయ్యాయి.
ఆందోల్ మున్సిపాలిటీ కాంగ్రెసు కైవసం చేసుకుంది.
అముదాలవలస, తుని మున్సిపాలిటీలు వైసిపి చేజిక్కాయి.
కరీంనగర్ కార్పోరేషన్‌ను తెరాస దక్కించుకుంది.
చిలకలూరిపేట మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను వైయస్సార్ కాంగ్రెసు గెలుచుకుంది.
భైంసా మున్సిపాలిటీలో మజ్లీస్ ఆధిక్యం కొనసాగిస్తోంది.
అమలాపురం మున్సిపాలిటీలో టిడిపి హవా కొనసాగించింది. అత్యధిక వార్డులను గెలుచుకుంది.

Leave a Comment