సూపర్ స్టార్ స్పూర్తితో ఐవరీ కోస్ట్ విజయం!

Footballరెసిఫే: ఐవరీ కోస్ట్ పుట్ బాల్ సూపర్ స్టార్ డిడైర్ డ్రోగ్బా సూర్ జపాన్ పై స్పూర్తిదాయకమైన  విజయాన్ని అందించారు.  బ్రెజిల్ జరుగుతున్న ప్రపంచ ఫుట్ బాల్ కప్ గ్రూప్ సీలో జపాన్ తో జరిగిన మ్యాచ్ లో ఐవరీ కోస్ట్ 2-1 స్కోర్ తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ 16 నిమిషంలో కీసుకే హోండా జపాన్ కు గోల్ కొట్టి ఆధిక్యం అందించాడు. తొలిభాగంలో ఐవరీ కోస్ట్ దాడులకు జపాన్ ధీటుగా సమాధానమిచ్చింది.
ఆ తొలి భాగంలో బెంచ్ కే పరిమితమైన డ్రోగ్బా 62 నిమిషంలో రంగంలోకి దిగి జట్టుకు జోష్ కలిగించాడు. డ్రోగ్బ్రా అందించిన ఊపుతో విల్ ఫ్రైడ్ బోని 64 నిమిషంలో, గెర్విన్హో 66 నిమిషంలో ‘హెడర్ గోల్’ తో ఐవరీ కోస్ట్ కు విజయాన్ని అందించారు.

Leave a Comment