సైనా ఆశలు సజీవం, పోరాడి ఓడిన సింధు

జకర్తా: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమిSaina Nehwalయర్ టోర్నిలో భారత బాడ్నింటన్ క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ మినహాయించి అందరూ ఇంటిదారి పట్టారు.
ఇస్టోరా గెలోరా బంగ్ కర్నో స్టేడియంలో జరిగిన పోటీలలో పీవీ సింధు, కే.శ్రీకాంత్, పారుపల్లి కాశ్యప్ లు ఓటమి పాలయ్యారు. ఈ టోర్ని ఒలంపిక్ కాంస్య పతక విజేత సైనా నేహ్వాల్ పోటిలో ముందుకు దూసుకెళ్లింది.
ధాయ్ లాండ్ ఆటగాడు పోర్నిప్ బురానాప్రసెర్ట్స్ పై 21-15, 21-10 తేడాతో విజయం సాధించారు. మరోపోటిలో చైనా మూడో ర్యాంక్ క్రీడాకారిణి యివాన్ వాంగ్ చేతిలో పోరాడి సింధు ఓడారు.
శ్రీకాంత్ పై చెన్ యెకున్  21-12, 17-21, 21-16 తేడాతో విజయం సాధించారు. డబుల్స్ విభాగంలో జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప ఇండోనేషియా ఆటగాళ్లతో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతున్నారు. ఇండోనేషియా టోర్ని బహుమతి విలువ 750,000 డాలర్లు.

Leave a Comment