కాశ్మీర్ తీవ్రవాద జాడ్యం మరొక సారి మన సైనికుల ప్రాణాలని బలి తీసుకుంది. కుటుంబసభ్యులతో ముందు రోజువరకూ గడిపిన అనుభూతులు ఇంకా జ్ఞాపకాలుగా మారకముందే ఆ జవాన్ల భవిష్యత్తు ముగిసిపోయింది.
గురువారం సాయంత్రం 3.15 గంటల సమయంలో, శలవులు ముగించుకుని ఇంటి నుండీ విధినిర్వాహణ కు వెళుతున్న CRPF సైనిక వాహనాల కాన్వాయి పైకి జమ్ము శ్రీనగర్ రహదారిపైన పుల్వామా జిల్లా అవంతిపొరా వద్ద పేలుడు పదార్దాలు నింపుకున్న స్కార్పియో వాహనంతో ఆత్మాహుతి దాడి జరిగింది. దాడికి గురైన వాహనశ్రేణిలో షుమారు 78 వాహనాల్లో 2500 CRPF జవాన్లు ప్రయాణిస్తుండగా, హంతకుడు వాహనంతో అకస్మాత్తుగా రహదారిపైకి వచ్చి గుద్దెయటంతో ఒక సైనిక బస్ నేరుగా పేలుడుకి గురి అయ్యింది. సంఘటన స్థలంలో 32 గా పేర్కొన్న అమరుల సంఖ్య ఈ వార్త వ్రాసే సమయానికి 59 కి చేరింది. ఘటనా స్థలంలో సైనికుల శరీర భాగాలు నలుదిక్కులా చెదిరిపోయి పడిఉన్నాయి. 80 కేజీల గరిష్ట శక్తి RDX పేలుడు పదార్దాలని ఈ దాడికి ఉపయోగించినట్లు నిపుణులు విశ్లేషిస్తుండగా దాడి తర్వాత కొంతసేపు కాల్పులు జరిపినట్లు స్థానికులు చెపుతున్నారు.
జమ్ము కాశ్మీర్ పోలీసులకి శుక్రవారం సాయంత్రానికి మొత్తం 7 మంది పుల్వామా జిల్లా యువకులు పట్టుబడ్డారు. పేలుడు పదార్దాలు, సంభందిత పరికరాలు అమర్చటంలో శిక్షణ పొందాడని భావిస్తున్న స్థానిక ఉగ్రవాది కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఈ ఘాతుకానికి తామే బాధ్యులమంటూ జైష్ ఎ మహమ్మద్ ఉగ్రవాద ఉన్మాదులు ఒక వీడియో విడుదల చేశారు. కాగా, ఆత్మాహుతి దాడి చేసి చనిపోయింది పుల్వామా జిల్లాకే చెందిన భవన నిర్మాణ కార్మికుడు అదిల్ అహ్మద్ దార్ గా తేలింది.
పాకిస్తాన్ మిలటరీ అధికారులు ఆరాధించే మౌలానా మసూద్ అజహర్ స్థాపించిన JEM లో శిక్షణ ఫలితమే ఈ తీవ్రవాద చర్య. 1999 సం. లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హై జాక్ ఉదంతంలో కాందహార్ విమానాశ్రయంలో భారతదేశం విడిచిపెట్టిన ఖైదీ ఈ మసూద్ అజహర్. ఈ JEM 2000 సం. కరాచీలో ఉనికిలోకి వచ్చింది. తదుపరి యేడాది 2001 లో భారత పార్లమెంట్ పై దాడికి తెగబడ్డారు. భారత్ అమెరికా మరియు సమకాలీన దేశాలు jem ని ఉగ్రవాద సంస్థగా గుర్తించి నిషేధించాయి.
సైనికుల త్యాగాలను వృధా పోనివ్వమని, ఈ దుష్ట చేష్టలకి మూల్యం చెల్లించక తప్పదని ప్రధాని మోడి ప్రకటించారు.
పుల్వామా దాడిని హేయమైన పిరికిపంద చర్య అంటూ ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి
ఐతే, దొషులను చంకలో పెట్టుకున్న పాకిస్తాన్ యధారీతిగా స్పందిస్తూ “భారత ఆక్రమిత కాశ్మీర్ లో జరిగిన ఈ దాడికి మేము చింతిస్తున్నాము. ప్రపంచంలో జరిగే ఏ హింసాత్మక చర్యలనైనా ఖండిస్తూ వచ్చాము. దర్యాప్తు లేకుండానే ఈ దాడితో పాకిస్తాన్ కి సంబంధాలపై భారతీయ మీడియా మరియు ప్రభుత్వం వేసే నిందలను మేము గట్టిగా తిరస్కరిస్తాము ” అంటూ సన్నాయి నొక్కులు నోక్కింది.
పాకిస్తాన్ లోని పలు ప్రాంతాలలో ఈ ఘటన తాలూకు వార్తలు చూస్తూ పాక్ పౌరులు ఆనందంగా వేడుకలు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాలలో సంబంధిత వర్గం వ్యక్తులు ఎమోజీ లతో వెకిలి చేష్టలు చెయ్యటం కనిపిస్తోంది.
పాకిస్తాన్, పెషావర్ పాఠశాలలో 2014 డిసెంబర్ లో ఉగ్రవాదులు 140 పాకిస్తానీల ప్రాణాలు తీశారు,.. అప్పుడు భారతీయులు ఇక్కడ దేశం నలుమూలలా కొవ్వొత్తుల ర్యాలీ లు నిర్వహించి సంఘీభావం ప్రకటించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం…
Recent Comments