సోనాక్షితో నటించడం ఇబ్బందిగా ఉందన్న రజనీకాంత్

sonakshi_rajni‘ఒక హీరోను ఇంతగా అభిమానిస్తారా? ఇంతగా ఆరాధిస్తారా?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సోనాక్షీ సిన్హా. ప్రస్తుతం రజనీకాంత్ ‘లింగా’ చిత్రంలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లొకేషన్లకు అభిమానులు పోటెత్తుతున్న తీరు చూసి సోనాక్షి పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను ఈ సందర్భంగా వెలిబుచ్చారు. ‘‘దక్షిణాదిన సినిమా తారలను దేవుళ్లతో సమానంగా అరాధిస్తారని విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. నిజంగా రజనీ సార్ పాపులారిటీ సాధారణమైనది కాదు. ‘సూపర్‌స్టార్’ అనే బిరుదుకు ఆయనే అలంకారం. ఇంత స్టార్‌డమ్ ఉండి కూడా ఆయన అంత నిరాడంబరంగా ఎలా ఉండగలుతున్నారో అర్థం కాదు. ఈ సినిమాతో నేను రజనీ అభిమాని అయిపోయాను. ఓ రోజు లొకేషన్లో…‘మీతో నటించడానికి ముందు కాస్త తడబడ్డాను. కానీ… ఇప్పుడు ఓ గొప్ప అనుభూతిని పొందుతున్నాను’ అన్నాను. దానికి ఆయన… ‘‘నాకు మాత్రం నీతో నటించడం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే… నువ్వు నా మిత్రుని కూతురువి. అంటే నాకూ కూతురు లాంటి దానివే. అందుకే’ అని బదులిచ్చారు’’ అని సోనాక్షీ సిన్హా వివరించారు.

Leave a Comment