సోనియా గాంధీపై కేసు కొట్టివేత

న్యూయార్క్: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీపై నమోదైన కేసును అమెరికాలోని ఓ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. 1984లో జరిగిన సిక్కుల ఊచకోత సంఘటనలో ప్రమేయమున్న కాంగ్రెస్ నాయకులను సోనియా కాపాడుతున్నారని ఆరోపిస్తూ.. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సిక్కుల హక్కుల సంస్థ కోర్టును ఆశ్రయించింది. బ్రూక్లిన్లోని యూఎస్ జిల్లా జడ్జి బ్రియాన్ ఎం కొగాన్ సోమవారం ఈ కేసును విచారించారు. ఈ కేసులో తగిన ఆధారాలు లేకపోవడంతో కొట్టివేసేందుకు అనుమతిచ్చారు.

Leave a Comment