స్పీకర్గా కోడెల ఏకగ్రీవంగా ఎన్నిక

kodela siva prasada raoహైదరాబాద్ :  నూతన ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి స్పీకర్‌గా తెలుగుదేశం సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం కాగానే పలువురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ పదినిమిషాలు వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రొటెం స్పీకర్ పతివాడ నారాయణస్వామి …స్పీకర్గా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…కోడెలను సభాపతి స్థానం వద్దకు మర్యాదపూర్వకంగా తోడ్కొని వెళ్లారు.అనంతరం ఆయనకు అభినందనలు తెలిపారు.  స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన కోడెలకు మంత్రులు, పలువురు శాసన సభ్యులు  అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ :  నూతన ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి స్పీకర్‌గా తెలుగుదేశం సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం కాగానే పలువురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ పదినిమిషాలు వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రొటెం స్పీకర్ పతివాడ నారాయణస్వామి …స్పీకర్గా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…కోడెలను సభాపతి స్థానం వద్దకు మర్యాదపూర్వకంగా తోడ్కొని వెళ్లారు.  స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన కోడెలకు పలువురు సభ్యులు  అభినందనలు తెలిపారు.

కాగా వైద్యవృత్తి నుంచి 1983లో నేరుగా రాజకీయాల్లోకి వచ్చిన కోడెల శివప్రసాదరావు 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా అయిదుసార్లు నరసరావుపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమిపాలైనా తాజా సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీచేసి విజయం సాధించారు.

Leave a Comment