హర్యానాలో బీజేపీ దే అధికారం

హర్యానాలో బీజేపీ భారీ మెజార్టీ సాధించింది.మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 47 స్థానాల్లో విజయఢంకా మోగించింది. అధికార కాంగ్రెస్ 15 సీట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. ఐఎన్ఎల్ డీ పార్టీకి 19 సీట్లు లభించాయి. ఇతరులకు 7, హెచ్ జేసీ కూటమికి 2 సీట్లు దక్కాయి.గత లోక్ సభ ఎన్నికల్లో  అనూహ్యంగా బిజేపీ రాష్ట్రంలో  10 లోక్ సభ స్థానాల్లో  7 స్థానాలు గెలుపొందింది. దీంతో బిజేపీ శ్రేణులు రెట్టించినఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో  పార్టీ విజయానికి  కృషి చేశారు.

Leave a Comment