హాట్ కేకుల్లా ఈ-కామర్స్ జాబ్స్….

దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్ విద్యా సంస్థల క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఈ-కామర్స్ సంస్థలే ఫేవరేట్లుగా నిలుస్తున్నాయి. వాటిలోనూ దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లే ముందంజలో ఉన్నాయి. అసోచామ్ 500 మంది విద్యార్థులతో నిర్వహించిన సర్వేలో రూ.10-25 లక్షల వార్షిక వేతనాలను ఆఫర్ చేస్తున్న ఈ-కామర్స్ సంస్థలను కాదని వేరే కంపెనీల వైపు ఎందుకు దృష్టి సారిస్తామని కూడా వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు.  కదిలిస్తే, వారిలో 71 శాతం మంది తాము ఈ-కామర్స్ సంస్థల ఉద్యోగాలకే ఓటేస్తామని తెలిపారు.

Leave a Comment