హాలీవుడ్ తరహాలో బాహుబలి ఫస్ట్ లుక్…

టాలీవుడ్ లేటెస్ట్ భారీ బడ్జెట్ సినిమా ‘బాహుబలి’లో ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల అయింది. శుక్రవారం మధ్యాహ్నం ఫస్ట్ లుక్ ను బాహుబలి టీం విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించి గతంలోనే ప్రభాస్ ఫొటోలుబయటకు వచ్చాయి. అయితే.., అవి టీజర్ లో కట్ చేసిన షాట్స్. దీంతో ఫ్యాన్స్ ఈ ఫోటోనే అఫీషియల్ ఫస్ట్ లుక్ అని అంటున్నారు. ఈ ఫొటోలో ప్రభాస్, ఈ మద్య వచ్చిన హాలీవుడ్ మూవీ ‘హర్ క్యులస్’ లో హీరో రాక్ లుక్ లా కన్పిస్తుంది. దీంతో ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పిరియాడికల్ మూవీ.., టాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఏడాదికి పైగా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.., ఇంకా షూటింగ్ మిగిలి ఉంది. ఏపీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ప్రస్తుతం రామోజి ఫిలింసిటీలో సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘బాహుబలి’ పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్టు చేయనని ప్రభాస్ డిసైడ్ అయి రంగంలోకి దిగాడు. ఇలా అనేక సంచలనాలతో తెరకెక్కుతున్న ‘బాహుబలి’లో దగ్గుబాటి రానా కూడా కీలక రోల్ పోషిస్తున్నాడు. అందాల భామ అనుష్క, మిల్కీ బ్యూటి తమన్నా ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి పార్ట్ 2015 ఏప్రిల్ లో విడుదల అవుతుందని చెప్తున్నారు. పొడవైన ఈ సబ్జెక్టుపై అభిమానులు, ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గకుండా ఉండేందుకు రాజమౌళి ఎప్పటికప్పుడు ‘బాహుబలి’ పేరు ప్రచారంలో ఉండేలా చూస్తున్నారు. అందులో భాగంగానే ఇలా పోస్టర్ల ద్వారా ప్రమోషన్ కల్పిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ మీకోసం అందిస్తున్నాం.

Leave a Comment