హిమాచల్ మృతుల కుటుంబాలకు.. ఏపీ 5 లక్షల ఎక్స్గ్రేసియా

babuహైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు లక్షల రూపాయిల చొప్పున ఎక్స్గ్రేసియా ప్రకటించారు. సహాయక ఏర్పాట్ల గురించి మంగళవారం చంద్రబాబు మంత్రులతో చర్చించారు.

హైదరాబాద్కు చెందిన 24 మంది ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బియాస్ నదిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు

Leave a Comment