హుదూద్ బాధితులకు కోటీ 25లక్షల విరాళం….

హుదూద్ తుపాను బాధితులకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరపున కోటి రూపాయల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. అలాగే ఎంపీ ల్యాడ్స్ నుంచి 25లక్షల రూపాయలు, రెండు నెలల జీతాన్ని ఆయన విరాళంగా అందజేయనున్నట్టు తెలిపారు.

Leave a Comment