హెరిటేజ్ సంస్థకు జాతీయ అవార్డు

heritageడెయిరీ రంగంలో అత్యుత్తమ ఇంధన పొదుపు పద్దతులు పాటించినందుకుగానూ  ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికిచెందిన హెరిటేజ్ సంస్థ విద్యుత్ పొదుపులో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్,చంద్రబాబు కోడలు అయిన నారా బ్రాహ్మణి ప్రకటించారు.

ఇంతకుముందు కూడా మూడుసార్లు సంస్థకు ఇందన పొదుపు అవార్డులు లభించాయి. ఈసారి ఉప్పల్ లోని హెరిటేజ్ డెయిరీ ప్లాంట్ కు ముప్పై ఎనిమిది లక్షలతో సాంకేతిక పరిజ్ఞానం అబివృద్ది పరచడం ద్వారా ఎనభై నాలుగు లక్షల రూపాయల మేర విద్యుత్ లో ఆదా చేసినట్లు ఆమె వెల్లడించారు.ఇందనాన్ని పొదుపు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం అప్ గ్రేడ్ చేయడానికి హెరిటేజ్ కట్టుబడి ఉంటుందని ఆమె తెలిపారు.ఈ నెల పద్నాలుగున కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

Leave a Comment