హెలికాప్టర్ ఘటనలో 16 మంది ఆచూకీ గల్లంతు

మాస్కో: రష్యాలో స్థానిక అధికారులు,  వ్యాపారస్థులతో పయనిస్తున్న ఓ హెలికాప్టర్ శనివారం కూలిన  ఘటనలో 16 మంది ఆచూకీ గల్లంతయ్యింది.  మొత్తం 19 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎమ్ఐ-8 హెలికాప్టర్ నిన్న ఆకస్మికంగా ఓ లోయలో కూలిపోయింది. వీరిలో ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారు. వాతావరణం సరిగా లేనందును మూర్ మాంస్క్ కు వాయువ్య దిశలో పయనిస్తున్న సమయంలో హెలికాప్టర్ కు సిగ్నల్స్ అందకపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.  కాగా, ఇందులో గాయపడిన ఇద్దర ఆచూకీ లభించడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మిగిలిన వారి ఆచూకీ మాత్రం లభించలేదు.
 
ఇదిలా ఉండగా ఆ హెలికాప్టర్ లో మొత్తం 18 మంది మాత్రమే ప్రయాణించినట్లు ఆ దేశ అత్యవసర మంత్రిత్వ శాఖ చెబుతుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుని ఉండవచ్చని దర్యాప్తు బృందం తెలిపింది.  ఏవియేషన్ అధికారుల వైఫల్యం కారణంగానే రష్యాలో తరుచు హెలికాప్టర్ దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.

Leave a Comment