హైకోర్టులో జయ బెయిల్ పిటిషన్

ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో శిక్ష ఖరారైన  అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టులో ఈ రోజు పిటిషన్ వేయనున్నారు. నేటి నుంచి అక్టోబర్ ఆరు వరకు హైకోర్టుకు దసరా సెలవులు ఉన్నందున ఈ బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణకు తీసుకునే అవకాశాలున్నాయి. కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నామని జయ తరఫు న్యాయవాది బీ కుమార్ తెలిపారు.

Leave a Comment